వికీపీడియా:తెవికీ - వికీపీడియా


Szukaj:



Ostatnio oglądane:
  • వికీపీడియా:తెవికీ [te]
  • Imaxe:Grafik blutkreislauf.jpg [ast]
  • Wikipedia:Sprachen [de]
  • 大清國 [zh-yue]
  • Immagine:Barnstar anime manga 7.png [it]
  • 16 X [pl]
  • Caf [scn]
  • ఫిబ్రవరి 17 [te]
  • Image:Bleach cover 01.jpg [ceb]
  • Vikipedio:Babel [eo]
  • Pociąg [pl]
  • Portal:Kunst und Kultur [de]
  • WTC-toorns [vls]
  • Main Page [pl]
  • Ciencies Poltiques [ast]
  • Image:Nuvola apps korganizer.png [zh]
  • Quilómetru [ast]
  • Wikipédia:Üdvözlünk, látogató! [hu]
  • Vayejo [lad]
  • Mmggini:Logu Google.jpg [scn]
  • 1993 [pl]
  • Anzo [lad]
  • Komyun (Pransiya) [ceb]
  • 7 marca [pl]
  • Timothy White [scn]
  • 2008 [tr]
  • 30 d\'agostu [ast]
  • Портал:Философия [ru]
  • N08g B n-hi ng (chok-ka) [zh-min-nan]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh
    Historia i autorzy | Źródło tekstu - Wikipedia | Edycja

    వికీపీడియా:తెవికీ

    వికీపీడియా నుండి

    చిన్నప్పుడు మీరు వామన గుంటలు, కోతి కొమ్మచ్చి, ఏడుపెంకులాట ఆడుకున్నారా? అయితే అదృష్టవంతులే! మరి మీ పిల్లలు? వాళ్ళకసలు వాటి పేర్లు కూడా తెలీదేమో! మరి మనం ఆడుకున్న ఆ ఆటలు మనతో అంతరించిపోవాల్సిందేనా? మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వాటి గురించి చెప్పాలంటే ఎలా? ఎక్కడో ఒకచోట వాటి గురించి రాసి పెడితే, ముందు తరాల వాళ్ళు వాటి గురించి తెలిసికోగలుగుతారు. ఇలా లోకంలోని ప్రతీ విషయం గురించీ ఒక పుస్తకంగా రాస్తే.. అదే విజ్ఞాన సర్వస్వం!


    తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు. పదిహేను వందల పైచిలుకు ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?

    విషయ సూచిక

    [మార్చు] వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

    వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాను మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

    [మార్చు] ఏమిటి వికీపీడియా విశిష్టత?

    వికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలకు వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.

    [మార్చు] భారతీయ భాషల్లో వికీపీడియా:

    మొదటగా 2001 లో ఇంగ్లీషులో మొదలైందీ వికీపీడియా. నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 200 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. హిందీ, సంస్కృతం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తెలుగు ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. మనకు గర్వకారణమైన విషయమేమిటంటే, భారతీయభాషల వికీపీడియాలన్నిటిలోకీ తెలుగే ముందుంది. వ్యాసాల సంఖ్యలోగానీ, సభ్యుల సంఖ్యలో గానీ తెలుగు వికీపీడియాదే అగ్రస్థానం.

    [మార్చు] తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు:

    తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 15 వందలకు పైగా సభ్యులు 25 వేలకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘ సేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూ కనిపిస్తారు.

    [మార్చు] ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?

    అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమేంటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో చూడండి.

    [మార్చు] ఇంతటి గొప్ప పనికి ఖర్చు కూడా గొప్ప గానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?

    సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకు అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు. సాఫ్టువేరును అభివృద్ధి చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా చేసారు. ఇక వ్యాసాలు - వ్యాసాలు రాసేవాళ్ళంతా మనబోటి వాళ్ళే. తమకు తెలిసిన విషయాలను ఉచితంగానే రాస్తున్నారు. ఎవరికి తెలిసిన విషయాలను వాళ్ళు రాస్తూ పోతే వికీపీడియాలో ఎంతటి విషయ సంపద పోగు పడుతుందో ఊహించండి.

    [మార్చు] ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?

    నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు.

    [మార్చు] దేని గురించి రాయవచ్చు?

    మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.

    [మార్చు] మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?

    ఏం పర్లేదు, లేఖిని వాడండి. ఒకే ఒక్క గంటలో మీరు దీన్ని సాధించగలుగుతారు. ఇక ఆ తరువాత తెలుగులో రాసుకుంటూ పోవడమే! కంప్యూటర్లో తెలుగు రాయవచ్చన్న విషయం మొదటి సారిగా తెలుసుకున్నప్పుడు ఒకాయన ఇలా అన్నారు.. “ఆహా! రోజుల తరబడి అన్నం తినని వాడికి షడ్రసోపేతమైన భోజనం దొరికినట్లుంది, నేనిక తెలుగులోనే రాస్తాను. దీన్ని కనిపెట్టిన వారికి భగవంతుడు చిరాయుష్షును ప్రసాదించు గాక”

    కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూంటే ఆ పనులేం గాను?

    మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే!

    [మార్చు] కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?

    నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.


    2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది. అలాగే 2006 నవంబరు 5 నాటి ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసం కారణంగా తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపై ఒక్కసారిగా తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానానికి దూసుకుపోయింది.


    మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.

    

    • ఈ వ్యాసాన్ని తెలుగు వికిపీడియా బృందం వ్రాసి, ప్రచురించి,అందరికీ పంచిపెట్టింది.
    • http://poddu.net/?p=32 లో ప్రచురింపబడింది
    • http://eemaata.com/em/issues/200703/1078.html లో ప్రచురింపబడింది
    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Autorem skryptu AdWiki v0.9 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License

    Darmowe Techno Darmowe Mp3 Pozycjonowanie stron! Mp3 Techno Mp3 Techno, Free Mp3 Techno Biblia Online Muzyczny Portal Pozycjonowanie Motoryzacja Modzie Teksty Piosenek Opisy GG, Pionowe Radio Bolesawiec Wyszukiwarka Mp3 Techno, Free Encyklopedia Encyklopedia PWN Banki, Konta Mp3 Techno Telefonia GSM, Logosy Katalog Stron kredyt, kredyty Darmowe Gry JAVA
    Gry Erotyczne | erotyka | przedstawiciel orange | mannesmann demag | bramka sms | Anonse towarzyskie | apartament Wrocaw | Nowosci Albumy,Filmy,Gry za Free | szkoa tenisa Warszawa | Mapa Gdynia | Amatorki | Sex anonse | Motorola gone dzwonki | Rozrywka | Toplista

    x